AP: తల్లి అనారోగ్యంతో పట్నా ఆస్పత్రిలో ఉన్నందుకు ఇవాళట్టి విచారణకు హాజరుకాలేనన్న ఐపీఎస్ సునీల్ నాయక్ విన్నపాన్ని హైకోర్టు మన్నించింది. ఆయన తరపు న్యాయవాది వాదనలు విన్న న్యాయస్థానం.. ఈరోజు విచారణ నుంచి సునీల్ నాయక్‌ను మినహాయింపునిచ్చింది. అయితే, ఈనెల 23న జరిగే తదుపరి విచారణకు మాత్రం హాజరుకావాలని ఆదేశించింది.