AP: రోడ్డు ప్రమాదాలపై CM చంద్రబాబు కలెక్టర్లకు కీలక సూచనలు చేశారు. ‘రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసు, రవాణాశాఖ ప్రత్యేక చర్యలు చేపట్టాలి. శ్రీకాకుళం జిల్లాలో చేపట్టిన విధానాలను అన్నిచోట్ల అమలు చేయాలి. సెల్ఫోన్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో కఠినంగానే వ్యవహరించాలి. బ్రీత్ అనలైజర్లు, స్పీడ్ గన్ల కొనుగోలుకు రూ.44 కోట్లు విడుదల చేస్తాం’ అని వెల్లడించారు.