CTR: వెంకటగిరి రూరల్(మం) పట్రపల్లి గ్రామానికి చెందిన అంగన్వాడి కార్యకర్త చేమూరు పెంచలమ్మ(50) గురువారం మృతి చెందారు. ఈ నెల 2న విజయవాడలో జరిగిన అంగన్వాడి నిరసన కార్యక్రమానికి వెళ్లిన సమయంలో ఆమెకు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. పెంచలమ్మ అంతిమయాత్ర శుక్రవారం పట్రపల్లి గ్రామంలో నిర్వహించనున్నారు.