AP: రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు విశాఖ, అనకాపల్లి, ప.గో. జిల్లాల్లోని అన్ని బ్లాక్ స్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. ఎస్పీలు.. ప్రతి బ్లాక్ స్పాట్‌ను తనిఖీ చేసి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మహిళలపై నేరాల్లో నిందితులు భయపడేలా కఠిన చర్యలు ఉండాలని తెలిపారు. మహిళలపై గృహహింస కేసుల్లోనూ తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు.