TG: మూసీ నిర్వాసితులకు అన్యాయం జరగనివ్వమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అబద్దపు ప్రచారాలను తిప్పికొట్టడానికే ‘మూసీ ఇన్వైట్ స్క్వేర్’ ప్రోగ్రాం ప్రారంభించామన్నారు. మూసీ పునరుజ్జీవంపై రాజకీయ పార్టీలు సానుకూలంగా ఉన్నాయా లేదా స్పష్టత ఇవ్వాలని అన్నారు. గ్యాస్ కొరత విషయంలో కేంద్రం పూర్తిగా విఫలం చెందిందని పేర్కొన్నారు.