TPT: యుద్ధ ప్రభావంతో గృహ అవసరాల గ్యాస్ కొరత ఏర్పడిందనే వదంతులు నమ్మవద్దని, జిల్లాలో తగినంత గ్యాస్ నిల్వలు ఉన్నాయని జాయింట్ కలెక్టర్ ఆర్. గోవిందరావు తెలిపారు. గురువారం కలెక్టరేట్లో గ్యాస్ ఏజెన్సీలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో గ్యాస్ సరఫరా సజావుగా కొనసాగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి శేషాచలం పాల్గోన్నారు.