TG: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. రైతు భరోసాను ఏడాదికి ఎకరాకు రూ.15 వేలకు పెంచుతామని హామీ ఇచ్చారని.. కానీ రూ.12 వేలకే పరిమితం చేశారని అందులో పేర్కొన్నారు. దాన్ని కూడా సమయానికి ఇవ్వడం లేదని చెప్పారు. యాసంగి పంట రైతు భరోసా రాక రైతులు అప్పుల పాలవుతున్నారని తెలిపారు.