SKLM: జిల్లాలో రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న 24 మంది గ్రేడ్-2 వీఆర్వోలకు గురువారం కలెక్టరేట్లో నిర్వహించిన కౌన్సెలింగ్ ద్వారా గ్రేడ్- 1 వీఆర్వోగా పదోన్నతులు కల్పించారు. ఈ సందర్భంగా పదోన్నతులు కల్పించిన కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్కు ఏపీ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం తరఫున కృతజ్ఞతలు తెలిపారు.