ATP: జిల్లాలో ప్రతిష్టాత్మక ‘డిస్నీ వరల్డ్ సిటీ’ ఏర్పాటు దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఈ ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ప్రసిద్ధ వాల్ట్ డిస్నీ సంస్థతో సంప్రదింపులు జరపాలని సీఎం చంద్రబాబు నాయుడు పర్యాటక శాఖను ఆదేశించారు. ఒకవేళ ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చితే రాయలసీమ ముఖచిత్రం పూర్తిగా మారిపోనుంది.