NLR: సీఎం రిలీఫ్ ఫండ్ నిరుపేదల పాలిట వరంలా మారిందని కోవూరు MLA వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. ఇందుకూరుపేట మండలం జగదేవిపేటకు చెందిన వంగపూడి సుమతి ప్రాణాపాయ స్థితిలో తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వైద్యానికి నగదు లేక ఇబ్బంది పడుతుండడంతో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా బాధితురాలికి రూ.3.05 లక్షలు మంజూరు చేయించారు.