NGKL: తాడూర్ మండలం నాగదేవపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ప్రారంభించారు. గ్రామాల అభివృద్ధిలో గ్రామ పంచాయతీలు కీలక పాత్ర పోషిస్తాయని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన పరిపాలన అందించేందుకు ప్రభుత్వం గ్రామ స్థాయిలో సౌకర్యాలను పెంచుతున్నదని తెలిపారు.