AP: మచిలీపట్నంలోని బందరు కోటలో కోదండ రామాలయ శిలా రాజగోపుర శిఖర ప్రతిష్ట వైభవంగా జరిగింది. ద్వాదశ పవిత్ర నదీజలాలతో, అయోధ్య పండితుల వేదమంత్రాల నడుమ మహా కుంభాభిషేకం నిర్వహించారు. ఆలయ పునర్నిర్మాణ బాధ్యతలు స్వయంగా తీసుకున్న మంత్రి కొల్లు రవీంద్ర దంపతులు ఈ కార్యక్రమంలో పాల్గొని సంపూర్ణ పూర్ణాహుతి సమర్పించారు.