AP: శెట్టిబలిజ జాతిపిత దొమ్మేటి వెంకటరెడ్డి జయంతిని(మార్చి 23) రాష్ట్ర పండుగగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. యువగళం పాదయాత్రలో లోకేష్ ఇచ్చిన హామీని నెరవేర్చినందుకు మంత్రి సవిత, ఇతర నేతలు సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. అట్టడుగు వర్గాల అభ్యున్నతికి, విద్యకు ఆయన చేసిన కృషిని ఈ సందర్భంగా కొనియాడారు.