KMM: BRS పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు ఈనెల 19న ఖమ్మంలో మినీ ప్లీనరీ నిర్వహించనున్నట్లు నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు తెలిపారు. గురువారం నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సభకు మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు హాజరుకానున్నట్లు వెల్లడించారు. పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతి డివిజన్ నుంచి భారీ సంఖ్యలో హాజరు కావాలని ఆయన కోరారు.