AKP: పాలిసెట్, ఏపీఆర్జేసీ రాసే విద్యార్థుల కోసం జిల్లాలో ఉచిత కోచింగ్ సెంటర్ను ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నాయుడు శుక్రవారం ప్రారంభించారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకుని మంచి ఫలితాలు సాధించాలని సూచించారు. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో శిక్షణ ఇవ్వడం అభినందనీయం అన్నారు.