ప్రకాశం: వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని మార్కాపురం జేసీ పి. శ్రీనివాసులు ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో RWS, మున్సిపల్ శాఖ అధికారులతో సమావేశమయ్యారు. జిల్లాలో ఎక్కడెక్కడ నీటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది, వాటి పరిష్కారం మార్గాల గురించి అధికారులను ఆరా తీశారు. సమస్యను దృష్టిలో ఉంచుకొని అవసరమైన చోట చలివేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు.