NRPT: జిల్లాలో గురువారం నిర్వహించిన డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్కి ఫిర్యాదుదారులు నేరుగా ఫోన్ చేసి తమ సమస్యలను తెలియజేశారు. ప్రజల నుంచి వచ్చిన ప్రతి ఫిర్యాదును త్వరితగతిన పరిష్కరిస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు. వాటిని చట్టం ప్రకారం పరిష్కరించేందుకు కృషి చేస్తామని బాధితులకు భరోసా కల్పించారు.