WGL: ఓరుగల్లు భద్రకాళి అమ్మవారి సన్నిధిలో శుక్రవారం విశేష పూజలు చేశారు. తెల్లవారుజామునే అర్చకులు శాస్త్రోక్తంగా పంచామృత అభిషేకాలు చేసి, నూతన వస్త్రాలు, ఆభరణాలతో జగన్మాతను శోభాయమానంగా అలంకరించారు. భక్తులు భారీగా తరలిరావడంతో ఆలయ పరిసరాలు భక్తిపారవశ్యంలో మునిగిపోయాయి. భక్తులు బారులు తీరి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.