WGL: చెన్నారావుపేట గిరిజన యువకుడిపై దాడి కలకలం రేపింది. అజ్మీర రాజు బైక్ వేగంగా నడిపాడనే కారణంతో కొందరు కాంగ్రెస్ నాయకులు ఇనుప రాడ్లు, కర్రలతో దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన యువకుడిని నర్సంపేట ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉంది. ఘటనపై తండావాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని న్యాయం చేయాలని పోలీసుల కోరారు.