GNTR: దుగ్గిరాల (M) మంచికలపూడి గ్రామం వద్ద ఉన్న రైల్వే గేటును మరమ్మతుల కారణంగా తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ నెల 19వ తేదీ వరకు మరమ్మతు పనులు జరగనున్న నేపథ్యంలో, గేటు వద్ద హెచ్చరిక ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఈ మార్గం గుండా వెళ్లే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.