ప్రకాశం: తర్లుపాడు మండలం కలుజువ్వలపాడులోని కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయం 2026 – 27కు గాను 6వ తరగతి, ఇంటర్ ప్రవేశాలకు నేటి నుంచి ఏప్రిల్ 1వరకు ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ ఎస్ మారుతీ దేవి ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ మీడియం కోర్సు బైపీసీ అందుబాటులో ఉందని, https:||apkgbu.apcfss.in వెబ్సైట్లో చూడొచ్చు అన్నారు.