MS ధోనీపై వచ్చిన ‘పరస్పర విరుద్ధ ప్రయోజనాల’ ఫిర్యాదును BCCI ఎథిక్స్ ఆఫీసర్ జస్టిస్ అరుణ్ మిశ్రా కొట్టివేశారు. ధోనీ తన క్రికెట్ అకాడమీ కోసం ‘ఆర్కా స్పోర్ట్స్ అండ్ మేనేజ్మెంట్’తో 2017లో ఒప్పందం చేసుకున్నాడు. అయితే, ‘పరస్పర విరుద్ధ ప్రయోజనాల’ నిబంధనలు సెప్టెంబర్ 2018 నుండి అమలులోకి వచ్చాయి. నిబంధనలు రాకముందే ఒప్పందం జరిగినందున ధోనీ రూల్స్ ఉల్లంఘించినట్లు కాదని స్పష్టం చేశారు.