AP: విశాఖలో క్యాప్ జెమినీ సీఈవో ఐమాన్ ఇజ్జత్‌తో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. విశాఖ ఐటీ హబ్‌గా ఎదుగుతోందని, TCS లాంటి సంస్థలు వస్తున్నాయని తెలిపారు. ఇక్కడ 20 వేల ఉద్యోగాల సామర్థ్యంతో ఐటీ సెంటర్, జీసీసీ ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే ఏపీ వర్సిటీలతో కలిసి ఎమర్జింగ్ టెక్నాలజీ ల్యాబ్స్, క్వాంటం వ్యాలీ అభివృద్ధికి సహకరించాలని క్యాప్ జెమినీని మంత్రి కోరారు.