ATP: జిల్లా వర్కింగ్ జర్నలిస్టులకు ఈ నెల 17న ఉచిత కంటి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఏపీ జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షులు మచ్చా రామలింగారెడ్డి గురువారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. నిత్యం కంప్యూటర్లపై పని చేయడం వల్ల జర్నలిస్టులకు కంటి సమస్యలు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని జర్నలిస్టులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.