BHPL: జిల్లాలోని ప్రజాపాలన-ప్రగతి కార్యక్రమ కవరేజ్ కోసం ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌కు వెళ్లిన మీడియా మిత్రులకు పెద్ద ప్రమాదం జరిగింది. మూడో ఫ్లోర్ నుంచి లిఫ్ట్ కేబుల్ తెగిపోవడంతో లిఫ్ట్ కింద పడిపోయింది. లిఫ్ట్‌లో ఉన్న ఆరుగురు జర్నలిస్టులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన వారిని BHPL 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.