ATP: ముస్లిం, మైనార్టీల అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు తెలిపారు. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని గురువారం ఆయన తన సొంత నిధులతో ఇమామ్లు, ముత్తవల్లిలకు నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక మైనార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.