భారత్ రెండు టీ20 జట్లను ఏర్పాటు చేస్తే బాగుంటుందని మాజీ కెప్టెన్ గంగూలీ అభిప్రాయపడ్డాడు. అన్ని అర్హతలు ఉన్నప్పటికీ శ్రేయస్ అయ్యర్, జైస్వాల్, రాహుల్, పంత్ వంటి ప్లేయర్లకు అవకాశాలు రావడం లేదన్నాడు. అలాగే, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ వంటి వారికి జట్టులో చోటు దక్కినా ప్లేయింగ్-11లో అవకాశం రావడం లేదని గుర్తుచేశాడు. అందుకే భారత్ రెండు జట్లను ఆడించాలని గంగూలీ వ్యాఖ్యానించాడు.