TG: లిక్కర్ స్కామ్ కేసులో జాగృతి అధ్యక్షురాలు కవితకు మరో షాక్ తగిలింది. సీబీఐ అధికారులు HYD బంజారాహిల్స్ నివాసానికి చేరుకున్నారు. ఈ కేసులో హైకోర్టు ఇచ్చిన నోటీసులను ఆమెకు జారీ చేసేందుకు వెళ్లారు. ఆమె లేకపోవడంతో సీబీఐ అధికారులు నోటీసులను భర్త అనిల్ కుమార్కు అందజేశారు. కవిత ఎక్కడికి వెళ్లారు, ఎప్పుడు అందుబాటులోకి వస్తారు అనే వివరాలను అధికారులు తెలుసుకున్నట్లు సమాచారం.