అనంతపురం రాజేంద్ర మున్సిపల్ హైస్కూల్లో పదో తరగతి విద్యార్థులకు మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ బల్లా పల్లవి విద్యా సామగ్రిని పంపిణీ చేశారు. తన మొదటి నెల జీతంతో విద్యార్థులకు ప్యాడ్లు, పెన్నులు, ఇతర వస్తువులను అందజేయడం సంతోషంగా ఉందని ఆమె తెలిపారు. అనంతరం త్వరలో పబ్లిక్ పరీక్షల నేపథ్యంలో పాఠశాలలో నిర్వహించిన సరస్వతి పూజలో ఆమె పాల్గొన్నారు.