BPT: కర్లపాలెం వైఎస్ఆర్ కూరగాయల మార్కెట్ వద్ద గురువారం వైసీపీ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను కర్లపాలెం మండల అధ్యక్షుడు యల్లావుల ఏడుకొండలు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా నాయకులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వైసీపీ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేసి పంచిపెట్టారు.