ఏపీ జెన్కో 6,610 మెగావాట్ల రికార్డు స్థాయి విద్యుదుత్పత్తి సాధించడం పట్ల మంత్రి గొట్టిపాటి రవికుమార్ హర్షం వ్యక్తం చేశారు. జెన్కో అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ జీవితకాల రికార్డు సాధనలో పాలుపంచుకున్న ప్రతి ఇంజినీర్, అధికారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. కేవలం అధికారుల, ఇంజినీర్ల కృషితోనే ఈ అరుదైన ఘటన సాధ్యమైందని ఆయన ప్రశంసించారు.