ప్రకాశం: పొదిలి మండలంలోని రాజుపాలేనికి చెందిన యువకుడికి ఓ యువతి ఫోన్ చేసింది. ‘మీ అమ్మ గారి LIC పాలసీకి బోనస్ వచ్చింది. నేను పంపిన లింకును క్లిక్ చేయండి’ అని ఆమె కోరింది. వెంటనే ఆ యువకుడు లింక్ ఓపెన్ చేయగా అకౌంట్లో ఉన్న రూ. 30వేలు కట్ అయ్యాయి. దీంతో అతడు వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.