TG: రాష్ట్రంలో పాఠశాలలకు హాఫ్ డే స్కూల్స్ షెడ్యూల్ను విద్యాశాఖ ప్రకటించింది. మార్చి16నుంచి ఏప్రిల్ 23 వరకు ఒంటిపూట బడులు నిర్వహించనున్నారు. 8AM నుంచి 12.30PM వరకు స్కూల్స్ నడపనున్నారు. మధ్యాహ్న భోజనం 12.30కు వడ్డించి.. ఆ తర్వాత విద్యార్థులను ఇంటికి పంపించేస్తారు. పదవ తరగతి పరీక్షా కేంద్రాలుగా ఉన్న పాఠశాలల్లో 1PM గంట నుంచి 5PM వరకూ ఒంటి పూట బడులు నిర్వహించనున్నారు.