ప్రకాశం: కొండపి అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలను గురువారం ఒంగోలు జాయింట్ కలెక్టర్ కల్పనాకుమారి, ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని విద్యార్థునులతో ముచ్చటించారు. పాఠశాలలో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థునుల నుంచి అడిగిన ప్రశ్నలకు సమాధానాలు రాబట్టారు. 10వ తరగతి విద్యార్థులను విద్యాబోధన జరిగే తీరును అడిగారు.