NDL: బనగానపల్లె పట్టణంలో ఇవాళ వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు కలిసి ఘనంగా నిర్వహించారు. 16వ వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే నాయకుల మధ్యన కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.