ADB: ఆశా వర్కర్ల యూనియన్ సభ్యులు బోథ్ MLA అనిల్ జాదవ్‌ను నేరడిగొండలోని ఆయన నివాసంలో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర ప్రభుత్వం గత రెండు నెలల నుంచి వేతనాలు చెల్లించక ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నామని ఎమ్మెల్యేతో ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తానని MLA అనిల్ జాదవ్ హామీ ఇచ్చారు.