MHBD: గూడూరు పోలీస్ స్టేషన్ CIగా వర్స వినయ్ కుమార్ గురువారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. పోలీస్ స్టేషన్లోని తన కార్యాలయంలో ఛార్జ్ తీసుకున్న ఆయనకు సిబ్బంది, స్థానికులు శుభాకాంక్షలు తెలిపారు. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని నూతన సీఐ కోరారు. పోలీసు విధులకు ఆటంకం కలిగిస్తే ఊరుకునేది లేదన్నారు.