W.G: ఉండి మండలం వెలివర్రుగ్రామంలోని శ్రీ వీరపే రాంటాలమ్మ అమ్మవారి హుండీ లెక్కింపు కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఉగాది అమ్మవారి జాతర నుంచి బుధవారం వరకు అమ్మవారికి రూ. 3 లక్షల 95వేల 61 వచ్చినట్టు ఆలయ ఛైర్మెన్ కళ్లేపల్లి సతీష్ రాజు తెలిపారు. ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు, ఎండోమెంట్ అధికారుల సమక్షంలో ఈ లెక్కింపు కార్యక్రమం జరిగింది.