HNK: రాయపర్తి మండలం కాట్రపల్లి గ్రామంలోని పెద్దమ్మ తల్లి ఆలయాన్ని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గురువారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కలు చెల్లించారు. అమ్మవారి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.