NGKL: పదర మండల కేంద్రంలో సర్పంచ్ రాయ ఎల్లమ్మ అధ్యక్షతన ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ గ్రామసభ నిర్వహించారు. ప్రత్యేక అధికారి వసీం పాల్గొని ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, మహాలక్ష్మి వంటి పథకాల లబ్ధిదారుల వివరాలను వివరించారు. తాగునీరు, పారిశుధ్యం మెరుగుదలపై చర్చించారు. అర్హులైన వారందరికీ సంక్షేమ ఫలాలు అందుతాయని హామీ ఇచ్చారు.