NRPT: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మక్తల్ మున్సిపాలిటీ కేంద్రంలోనీ పలు వార్డులలో సభలను నిర్వహించారు. ఈ సభలలో వార్డు సమస్యలను గురించి, జరగాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు గురించి తదితర అంశాలను చర్చించారు. కార్యక్రమాలలో మున్సిపల్ ఛైర్మన్ మానస, వార్డు కౌన్సిలర్లు, సంబంధిత అధికారులు, కోఆప్షన్ సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు.