AP: రాజధానికి పట్టిన గ్రహణం వీడిందని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. ‘ప్రజారాజధాని అమరావతికి చట్టబద్ధత వచ్చింది. దీనికి సహకరించిన పార్టీలు, నేతలకు ధన్యవాదాలు. ఈ ఆనంద సమయంలో అమరావతికి దీపహారతులు ఇద్దాం. రాత్రి 7 గంటలకు అందరూ ఇళ్లముందు దీపాలు వెలిగించి.. సెల్ఫీ తీసుకుని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయాలి. #APThanksIndia హ్యాష్ ట్యాగ్‌తో అందరూ షేర్ చేయండి’ అంటూ పిలుపునిచ్చారు.