మహబూబ్నగర్ రూరల్ మండలం ధర్మాపూర్ గ్రామంలో ఉన్న రుక్మిణి పాండురంగ స్వామి దేవస్థానం ఎంతో మహిమాన్వితమైనదని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస రెడ్డి అన్నారు. రుక్మిణి పాండురంగ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆయన స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ సర్పంచ్ రాజు గౌడ్ ఎమ్మెల్యేలు సాదరంగా స్వాగతం పలికి ఘనంగా సత్కరించారు.