AP: అమరావతి కోసం సింగపూర్ మాస్టర్ ప్లాన్ ఇచ్చిందని సీఎం చంద్రబాబు అన్నారు. ‘ప్రపంచంలోనే ఉత్తమ రాజధానిగా అమరావతిని తయారు చేస్తాం. అమరావతిలోని అభివృద్ధి పనులను త్వరలో ప్రధాని ప్రారంభిస్తారు. వైసీపీకి ఇంకా జ్ఞానోదయం కలగలేదు. మావిగన్ అంటూ జగన్ కొత్త పదం తీసుకొచ్చారు. దాని అర్థం నాకెక్కడా దొరకలేదు. చట్టాన్ని మార్చాలని పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడుతున్నారు’ అంటూ మండిపడ్డారు.