NDL: అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించాలని సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ కార్యదర్శి పిక్కిలి వెంకటేశ్వర్లు కోరారు. ఖరీఫ్‌లో రైతులు పండించిన మొక్కజొన్నకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఇవాళ సూచించారు. ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు అయినా కొత్త పెన్షన్లు అమలు కాలేదని విమర్శించారు.