NLG: జిల్లాలోని ప్రధాన పత్రికల జర్నలిస్టులందరికీ నిబంధనల ప్రకారం అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయాలని కోరుతూ జర్నలిస్టులు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి వినతిపత్రాలు అందజేశారు. దీనిపై స్పందించిన నేతలు.. ముఖ్యమంత్రితో చర్చించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.