HNK: ఇంధన ధరల భారంతో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై కేంద్రాన్ని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య లోక్ సభలో ప్రశ్నించారు. మార్కెట్ ఆధారిత ధరల విధానంతో రైతులపై అదనపు భారం పడుతుందని, సాగు ఖర్చులు పెరిగి ఆదాయాలు దెబ్బతింటున్నాయని తెలిపారు. వ్యవసాయ రంగానికి ప్రత్యక్ష ఉపశమనం కల్పించే విధంగా ప్రత్యేక ధరలు, సబ్సిడీలు ఇవ్వాలని ఎంపీ డిమాండ్ చేశారు.