MLG: ములుగు మున్సిపాలిటీలో ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక సభలు విఫలమయ్యాయని బీజేపీ అర్బన్ అధ్యక్షుడు ఇమ్మడి రాకేష్ యాదవ్ విమర్శించారు. సభల్లో ప్రజలు లేక ఖాళీ కుర్చీలు కనిపిస్తున్నాయని అన్నారు. గతంలో తీసుకున్న సంక్షేమ పథకాల దరఖాస్తులు పెండింగ్లోనే ఉన్న పరిష్కరించకుండా కొత్తగా మళ్లీ ఎందుకని ప్రశ్నించారు. వెంటనే సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.