KDP: మైలవరంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు విజయవంతంగా ముగిశాయని MEO చిట్టిబాబు తెలిపారు. రంజాన్ పండుగ కారణంగా వాయిదా పడిన ఇంగ్లీష్ పరీక్షను గురువారం కేంద్రాల్లో ప్రశాంత వాతావరణంలో నిర్వహించినట్లు చెప్పారు. మార్చి 16న ప్రారంభమైన ఈ పరీక్షలు, నేటి ఇంగ్లీష్ పరీక్షతో పూర్తయ్యాయి. ఇవాళ జరిగిన పరీక్షకు 100 శాతం విద్యార్థులు హాజరైనట్లు ఆయన పేర్కొన్నారు.