జేఈఈ మెయిన్ 2026 సెషన్-2కు సంబంధించి మిగిలిన పరీక్ష తేదీల అడ్మిట్ కార్డులను NTA విడుదల చేసింది. ఏప్రిల్ 5, 6, 7, 8 తేదీల్లో పరీక్షలు రాయనున్న అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులను అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసిన కార్డుపై క్యూఆర్ కోడ్ & బార్కోడ్ స్పష్టంగా ఉన్నాయో లేదో చూసుకోవాలని అధికారులు సూచించారు.